ఆ పరీక్షతో లక్షణాల్లేని కరోనా జాడ గుర్తింపు

ఎలాంటి లక్షణాలూ లేని కొవిడ్‌ కేసుల జాడను త్వరగా గుర్తించేందుకు ఆర్టీ-ల్యాంప్‌ లాలాజల పరీక్షే ఉత్తమమని జపాన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘‘లక్షణాల్లేని కేసులను గుర్తించడం కష్టతరం కావడంతో కొవిడ్‌ నియంత్రణ అసాధ్యమవుతోంది.

Updated : 30 Sep 2020 07:10 IST

టోక్యో: ఎలాంటి లక్షణాలూ లేని కొవిడ్‌ కేసుల జాడను త్వరగా గుర్తించేందుకు ఆర్టీ-ల్యాంప్‌ లాలాజల పరీక్షే ఉత్తమమని జపాన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ‘‘లక్షణాల్లేని కేసులను గుర్తించడం కష్టతరం కావడంతో కొవిడ్‌ నియంత్రణ అసాధ్యమవుతోంది. విరివిగా చేసే పీసీఆర్‌ పరీక్షలను ఆర్టీ-లాంప్‌ టెస్ట్‌తో పోల్చి చూశాం. ఇందులో భాగంగా జపాన్‌లోని 2 వేల మంది నుంచి నాసోఫర్యాంజిల్‌ స్వాబ్‌ను, లాలాజల నమూనాలను సేకరించాం. రెండింటిలోనూ ఫలితాలు దాదాపు ఒకే విధంగా వచ్చాయి. అయితే... ముక్కు నుంచి సేకరించే నమూనాలతో పోల్చితే ఆర్టీ-ట్యాంప్‌తో నిర్వహించే లాలాజల పరీక్ష చాలా సులభం. త్వరగా, ఎక్కువమందికి ఒకేసారి పరీక్షలు చేసేందుకు అనువుగా ఉంటుంది’’ అని హొకైడో యూనివర్సిటీ పరిశోధకుడు తకనొరి తెషిమా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు