సంజనా సంపాదనే వేరు!

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న సినీ నటి సంజనా గల్రాని ఆదాయ మార్గాలపై

Updated : 08 Oct 2020 07:55 IST

బెంగళూరు (యశ్వంతపుర): కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న సినీ నటి సంజనా గల్రాని ఆదాయ మార్గాలపై సీసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దృష్టి సారించారు. ఆమె ఆదాయ మూలాలను ఒక్కొక్కటిగా దర్యాప్తు చేసి సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఓ వైపు దర్యాప్తు కొనసాగుతుండగానే చైనా దేశానికి చెందిన బింగో, హకూన యాప్‌ల ద్వారా ఆమె నగదు సంపాదిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చినట్లు సీసీబీ అధికారులు వివరించారు. బింగో అనేది అంతర్జాలంలో నగదు పెట్టుబడి పెట్టి ఆడే ఆట. ఇది క్యాసినో జూదాన్ని పోలిందే. హకూన యాప్‌ ద్వారా ఛాటింగ్‌, సమాచారం పంపించుకోవడం తదితరాలు కొనసాగించవచ్ఛు మాటల ద్వారానే వివిధ అంశాలపై బెట్టింగులు నిర్వహించవచ్చని గుర్తించారు. ఈ యాప్‌ సాయంతో ఆమె నగదు బదిలీలు చేసినట్లుగా గుర్తించారు. ఆ అంశాలపై ఈడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విలాసవంతమైన మందు పార్టీలు ఏర్పాటు చేయడం, వాటికి హాజరవుతున్న శ్రీమంతులు, పారిశ్రామిక వేత్తల కుటుంబీకులు, సినీ నటులకు మత్తు పదార్థాలు సరఫరా చేయడం ద్వారా ఆమె ఆదాయం విపరీతంగా గడించారని అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని