తెలంగాణ: 403 కొత్త కేసులు.. 2 మరణాలు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,930 పరీక్షలు నిర్వహించగా 403 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి.

Updated : 29 Mar 2021 09:49 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో రోజువారి కరోనా కేసుల్లో కాస్త తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 33,930 పరీక్షలు నిర్వహించగా 403 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య అంతకు ముందు రోజు 535గా ఉంది. తాజా కేసులతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో..ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1690గా ఉంది. తాజాగా 313 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,00,469కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,583 క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 1,815 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో 146 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,00,53,026 కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు. 

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా నిన్న 9,962 మందికి డోస్‌-1, 5 మందికి డోస్‌-2 టీకా వేశారు. ఇప్పటి వరకు 9,38,658 మందికి డోస్‌-1, 2,34,508 మందికి డోస్‌-2 కరోనా టీకా వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.  

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని