Covid ‘వాసన’ పట్టేస్తుంది!

వాసన కోల్పోవడంతో ముడిపడిన కొవిడ్‌-19 వంటి రుగ్మతలను వేగంగా పసిగట్టేందుకు ఒక పరీక్ష విధానాన్ని బ్రిటన్‌లోని క్వీన్‌ మేరీ విశ్వవిద్యాలయ

Updated : 12 Aug 2022 15:17 IST

సులువైన పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన బ్రిటన్‌ శాస్త్రవేత్తలు

దిల్లీ: వాసన కోల్పోవడంతో ముడిపడిన కొవిడ్‌-19 వంటి రుగ్మతలను వేగంగా పసిగట్టేందుకు ఒక పరీక్ష విధానాన్ని బ్రిటన్‌లోని క్వీన్‌ మేరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది క్యాప్సూల్‌ ఆధారిత వాసన పరీక్ష అని వారు తెలిపారు. విస్తృత జనాభాలో కొవిడ్‌ను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా వైరస్‌తోపాటు పార్కిన్‌సన్స్, అల్జీమర్స్‌ వంటి నాడీ సంబంధ వ్యాధులను ఈ వాసన పరీక్ష సాయంతో గుర్తించొచ్చు. అయితే ఇవి విస్తృతంగా అందుబాటులో లేవు. పైగా చాలా ఖరీదైనవి. సాధారణ ఆరోగ్యపరిరక్షణ కేంద్రాల్లో వీటిని నిర్వహించడానికి చాలా సమయం పడుతుంది.

ఈ సమస్యను అధిగమించడానికి క్వీన్‌ మేరీ వర్సిటీ శాస్త్రవేత్తలు వినూత్న వాసన పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో రెండు పట్టీలు మధ్య సువాసనలు వెదజల్లే ఆరోమేటిక్‌ నూనెలతో కూడిన క్యాప్సూల్స్‌ను ఉంచారు. పరీక్షను నిర్వహించడానికి ఈ క్యాప్సూల్స్‌ను రెండు వేళ్లతో గట్టిగా వత్తి, పట్టీలను తొలగించాలి. దీంతో క్యాప్సూల్స్‌లోని సువాసన బయటకు విడుదలవుతుంది. వీటిని గుర్తించడంలో సదరు వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి అతడికి ఒక స్కోరు లభిస్తుంది. దాని  ఆధారంగా అతడిలో వాసన చూసే సామర్థ్యం తగ్గిందా అన్నది వైద్యుడు గుర్తిస్తాడు. ఈ విధానం కోసం స్వాబ్‌ పరీక్షల తరహాలో శరీరంలోకి ఎలాంటి సాధనాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండదు. పరీక్షార్థిపై ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని