AP News: ఆగస్టు 16 నుంచి బడుల ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

Updated : 07 Jul 2021 14:18 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు- నేడు పెండింగ్‌ పనుల పూర్తికి సీఎం ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్‌ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందన్నారు. దీని వల్ల ఏ స్కూల్‌ మూతపడదని.. ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని సురేష్‌ వివరించారు. రెండేళ్లలో ఫౌండేషన్‌ స్కూళ్లకు అదనపు గదులను నిర్మిస్తామన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు 70 శాతం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కులు.. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్‌ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని