Updated : 28 Jul 2021 09:22 IST

Srisailam Dam: నేడు శ్రీశైలం గేట్ల ఎత్తివేత.. కుడిగట్టు జల విద్యుత్‌కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో బుధవారం జలాశయం గేట్లను పైకెత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3, సాయంత్రం 5 గంటల మధ్యలో జలాశయం గేట్లను పైకెత్తనున్నట్లు ఆనకట్ట పర్యవేక్షక ఇంజినీర్‌ వెంకటరమణయ్య తెలిపారు. 2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు మంగళవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 3,98,288 క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.60 అడుగులు, గరిష్ఠ నీటినిల్వ 215.807 కాగా, ప్రస్తుత నీటినిల్వ 172.6615 టీఎంసీలుగా నమోదైంది.


సుంకేసుల నుంచి నీటి విడుదల

ఈనాడు, కర్నూలు: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి వరద జలాలు మంగళవారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సుంకేసుల జలాశయానికి చేరాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో 24 గేట్లను ఒక మీటరు ఎత్తి, సుమారు లక్షాఆరువేలు క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని