TS News: ‘మా నాన్న తాగొచ్చి మమ్మల్ని కొడుతున్నాడు’

‘నాన్న నిత్యం మద్యం తాగొచ్చి అమ్మతో గొడవపడుతున్నాడని, కుటుంబ సభ్యులందర్నీ కొడుతున్నాడని’ పేర్కొంటూ ఓ బాలిక(12) సోమవారం జగిత్యాల పట్టణ పోలీసులను ఆశ్రయించింది. నేరుగా స్టేషన్‌కు వచ్చిన

Updated : 03 Aug 2021 08:41 IST

ఎస్‌ఐకు బాలిక ఫిర్యాదు

జగిత్యాల, న్యూస్‌టుడే: ‘నాన్న నిత్యం మద్యం తాగొచ్చి అమ్మతో గొడవపడుతున్నాడని, కుటుంబ సభ్యులందర్నీ కొడుతున్నాడని’ పేర్కొంటూ ఓ బాలిక(12) సోమవారం జగిత్యాల పట్టణ పోలీసులను ఆశ్రయించింది. నేరుగా స్టేషన్‌కు వచ్చిన బాలిక.. ఎస్‌ఐ నవత ఎదుట తన బాధను వెళ్లగక్కింది. ప్రతిరోజూ ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాటివల్ల తనతోసహా కుటుంబ సభ్యులు మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కన్నీటిపర్యంతమైంది. స్పందించిన ఎస్‌ఐ బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తండ్రికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇకనైనా మారాలని హితవు పలికారు. ఇకపై ఎప్పుడు సమస్య పునరావృతమైనా డయల్‌ 100కు సమాచారమిస్తే తానొస్తానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని