pulichintala project: కొనసాగుతున్న స్టాప్‌ లాక్‌ ఏర్పాటు ప్రక్రియ

పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటు  ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది.

Updated : 07 Aug 2021 13:48 IST

పులిచింతల : పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటు  ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్‌ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. స్టాప్‌ లాక్‌లో భాగంగా మొత్తం 11 ఎలిమెంట్లను నిపుణులు అమర్చనున్నారు. ఎగువ నుంచి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుత నీటి నిల్వ 5 టీఎంసీల కంటే తక్కువగా ఉంది. ఈ పనుల నేపథ్యంలో పులిచింతల డ్యాంపైకి సందర్శకులను అనుమతించడం లేదు. పులిచింతల ప్రాజెక్టు వద్ద బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.

స్టాప్‌లాక్‌ గేటును శుక్రవారానికి ఏర్పాటుచేస్తామని యంత్రాంగం చెప్పినా అది సాధ్యపడలేదు. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు భారీగా పెరగడంతో జలాశయాన్ని ఖాళీ చేయించడం ఆలస్యమైంది. ఈ కారణంగానే తాత్కాలిక గేటు నిర్మాణ పనులు శుక్రవారం చేపట్టలేకపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని