Robot: బీబోట్‌.. బీచ్‌లను శుభ్రం చేసే రోబో

సముద్రతీరం వద్ద హాయిగా సేద తీరుతూ.. రోజువారీ ఇబ్బందులను మర్చిపోవాలని ఎవరికి ఉండదు?

Updated : 10 Aug 2021 06:20 IST

వాషింగ్టన్‌: సముద్రతీరం వద్ద హాయిగా సేద తీరుతూ.. రోజువారీ ఇబ్బందులను మర్చిపోవాలని ఎవరికి ఉండదు? బీచ్‌లు కాలుష్య కోరల్లో చిక్కుకొని, చెత్తకుప్పల్లా మారిపోతుండటంతో అనేకచోట్ల ప్రజలు ఆహ్లాదానికి నోచుకోవడంలేదు. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు ‘బీబోట్‌’ అనే రోబోను అభివృద్ధి చేశారు. ఇది తీర ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దుతుంది. చిన్నపాటి ప్లాస్టిక్‌ ముక్కలనూ వదలకుండా ఏరేస్తుంది. బ్యాటరీతో నడిచే ఈ యంత్రం.. ఇసుక తెన్నుల్లో అలవోకగా పయనిస్తూ, శుభ్రం చేస్తుంది. సముద్ర తీరాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులతో చాలా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. సకాలంలో తొలగించకుంటే అవి కొంతకాలానికి చిన్నతునకలుగా మారి, సాగర జలాల్లోకి ప్రవేశిస్తాయి. అంతిమంగా అవి సముద్ర పక్షులు, తాబేళ్లు, చేపలు, మానవ అవయవాల్లోకి చేరే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బీబోట్‌ లాంటి సాధనాలు చాలా అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని