Donkey milk: గాడిద పాలు లీటరు రూ.10వేలు

ఆవు, గేదె పాలకు డిమాండ్‌ బాగా ఉంటుందని మనకు తెలుసు. కానీ, మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో మాత్రం గాడిద పాలకు భలే గిరాకీ ఉంది.

Published : 11 Aug 2021 12:17 IST

ఉమర్గా: ఆవు, గేదె పాలకు డిమాండ్‌ బాగా ఉంటుందని మనకు తెలుసు. కానీ, మహారాష్ట్ర ఉస్మానాబాద్‌లో మాత్రం గాడిద పాలకు భలే గిరాకీ ఉంది. అయితే.. ధర తక్కువగా ఉన్నందు వల్లే ఇంత డిమాండ్‌ ఉందని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ గాడిద పాలు లీటరు రూ. 10 వేల వరకు అమ్ముతున్నారంటే నమ్మశక్యంగా అనిపించదు. ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబీకులు దాదాపు 20 గాడిదలతో పాల వ్యాపారం చేస్తున్నారు. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ పాలకు భారీగా డిమాండ్‌ ఉందని లక్ష్మీబాయి ధోత్రే తెలిపారు. 10 మి.లీ. పాలు రూ.100కు విక్రయిస్తున్నారు. చిన్నపిల్లలకు ఈ పాలు ఎంతో బలాన్నిస్తాయని ధోత్రే వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు