Telangana Schools Reopen: బడికి పంపడం తల్లిదండ్రుల ఇష్టమే!

ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం

Updated : 24 Aug 2021 09:54 IST

టీవీ పాఠాలూ కొనసాగుతాయి

ఈనాడు, హైదరాబాద్‌: ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీలు సహా అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసినా పిల్లలను తప్పక ప్రత్యక్ష తరగతులకు పంపాలా?.. లేదా? అన్న విషయాన్ని వెల్లడించలేదు. అధికారులు మాత్రం తప్పనిసరిగా పంపాలని చెప్పబోమంటున్నారు. అంటే పిల్లలను బడులకు పంపాలా? ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చా? అన్నది తల్లిదండ్రుల ఇష్టమేనని స్పష్టమవుతోంది. టీవీల ద్వారా డిజిటల్‌ పాఠాలు యథావిధిగా కొనసాగుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మార్గదర్శకాలపై ఆయా శాఖలు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన సీఎం సమావేశం తర్వాత అధికారులతో సమావేశమై చర్చించారు.

ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకమని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ‘స్వచ్ఛ కార్మికుల పునర్నియామకం చేపట్టాలి’ అని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజాభాను చంద్రప్రకాశ్‌తో పాటు టీపీటీఎఫ్‌ కోరింది. ప్రభుత్వ నిర్ణయంపై టీఆర్‌టీఎఫ్‌, ఎస్‌జీటీ ఫోరం, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం హర్షం వ్యక్తం చేశాయి. విడతల వారీగా తరగతులను ప్రారంభించాలని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం కోరింది. కళాశాలలను ప్రారంభించడంపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్య ఐకాస స్వాగతిస్తోందని ఛైర్మన్‌ పి.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని