
Indira Park: పెళ్లికాని జంటలకు నిషేధం.. బోర్డు తొలగింపు
కవాడిగూడ, న్యూస్‌టుడే: పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఇందిరాపార్కులో ఇటీవల ఒక బోర్డు వెలిసింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో గురువారం తొలగించారు. ఈ పార్కుకు ఉదయం, సాయంత్రం నడక కోసం వందల మంది వస్తుంటారు. మధ్యాహ్న సమయంలో పెళ్లికాని యువతీ యువకులు వస్తుంటారు. రాత్రి చీకటి మాటున వ్యభిచారులు తిష్ఠవేస్తున్నారని, సెక్యురిటీగార్డులే వారికి కాపలా కాస్తుంటారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందిరాపార్కు ఇన్‌ఛార్జి సత్యతేజ పెళ్లికాని జంటలకు నిషేధం అని బోర్డు పెట్టించారు. రెండు రోజుల అనంతరం ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ బోర్డు తీయించారు. బోర్డు ఎందుకు పెట్టించారు? అనే వివరణకు అధికారుల నుంచి సమాధానం లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.