Gannavaram Airport: గన్నవరంలో బోయింగ్‌ 777 ల్యాండింగ్‌ విజయవంతం

గన్నవరం విమానాశ్రయంలో బుధవారం రాత్రి బోయింగ్‌ 777 విమానం విజయవంతంగా దిగింది. ఎయిర్‌ ఇండియా వన్‌గా పిలిచే ఈ విమాన సర్వీసును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి..

Published : 27 Aug 2021 11:33 IST

అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో బుధవారం రాత్రి బోయింగ్‌ 777 విమానం విజయవంతంగా దిగింది. ఎయిర్‌ ఇండియా వన్‌గా పిలిచే ఈ విమాన సర్వీసును రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విదేశీ పర్యటనలకు వినియోగిస్తుంటారు. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఈ విమానం దిగడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. గత నెలలో గన్నవరం విమానాశ్రయాన్ని అధికారులు పరిశీలించారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన రన్‌వేను జులై నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఉన్న రన్‌వే 7500 అడుగుల విస్తీర్ణంలో ఉండగా.. తాజాగా 11,023 అడుగులకు పెరిగింది. దీంతో భారీ విమాన సర్వీసులు దిగేందుకు వీలు కలిగింది. ప్రస్తుతం ఎయిర్‌బస్‌ ఎ380, ఎ340, బోయింగ్‌ 747, 777 లాంటి కోడ్‌ఈ స్థాయి విమానాలు రాకపోకలు సాగించొచ్చు. ఈ నేపథ్యంలోనే బోయింగ్‌ 777 విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసి, తిరిగి టేకాఫ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని