Huzurabad by election: దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక
తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది.
దిల్లీ : తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఈసీ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది. ఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమైంది.
బంగాల్,ఒడిశాలో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం
ఈ నెల 30న బంగాల్‌లోని భవానీపూర్, జంగీపూర్, శంషేర్‌గంజ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
GT vs CSK: గుజరాత్ బోణీ.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం
-
India News
Navjot Singh Sidhu: జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..!
-
World News
NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
-
Movies News
Pathaan: ‘బేషరమ్ రంగ్’ వివాదం.. ఇప్పుడు స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే?
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!