జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరణ

అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

Updated : 15 Sep 2021 13:28 IST

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు..  బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం నిన్న వ్యాఖ్యానించింది. తాజాగా బెయిల్‌ రద్దు పిటిషన్‌ బదిలీని నిరాకరిస్తూ రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మరోవైపు ‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును మాత్రం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని