Free sanitary napkins: అతివలకు ఉచితంగా న్యాప్‌కిన్లు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు 19 నుంచి కీలకమైన పథకానికి రాజస్థాన్‌ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ..

Published : 22 Sep 2021 11:14 IST

జైపుర్‌: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు 19 నుంచి కీలకమైన పథకానికి రాజస్థాన్‌ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా న్యాప్‌కిన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి రూ.200 కోట్లు కేటాయించేందుకు ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అనుమతిచ్చారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా దశలవారీగా న్యాప్‌కిన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటిని రాష్ట్ర ఆరోగ్య సేవల సంస్థ తయారు చేస్తుంది. రాష్ట్రస్థాయిలో ఒకరు, జిల్లాకు ఒకరు వంతున ప్రచారకర్తలను నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని