Puneeth Rajkumar: కార్డియాక్‌ అరెస్టుతోనే పునీత్‌ మరణం

పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘కార్డియాక్‌ అరెస్ట్‌’తోనే మరణించినట్లు వైద్యులు గుర్తించారు. శుక్రవారం ఉదయం 9గంటల వరకు వ్యాయామం చేసి అల్పాహారం తీసుకున్నాక ఆయన అస్వస్థతకు గురయ్యారు. తమ కుటుంబ వైద్యుడు డా.రమణారావు నిర్వహించే రమణశ్రీ

Updated : 27 Feb 2024 17:08 IST

బెంగళూరు, న్యూస్‌టుడే: పునీత్‌ రాజ్‌కుమార్‌ ‘కార్డియాక్‌ అరెస్ట్‌’తోనే మరణించినట్లు వైద్యులు గుర్తించారు. శుక్రవారం ఉదయం 9గంటల వరకు వ్యాయామం చేసి అల్పాహారం తీసుకున్నాక ఆయన అస్వస్థతకు గురయ్యారు. తమ కుటుంబ వైద్యుడు డా.రమణారావు నిర్వహించే రమణశ్రీ క్లినిక్‌కు భార్య అశ్వినితో కలిసి వెళ్లారు. ‘జిమ్‌లో నుంచి రావడంతోనే చెమటలు పట్టాయి. అన్ని రకాల వ్యాయామాలు చేశా. బాక్సింగ్‌ చేశా. ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది..’ అని పునీత్‌ తనతో చెప్పారని రమణారావు తెలిపారు. ‘సుమారు 11.10కి ఈసీజీ తీస్తే హృదయస్పందన అసహజంగా కనిపించింది. తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించా. కారు వరకు నడిచి ఇబ్బంది పడకూడదని చక్రాల కుర్చీలో తీసుకెళ్లి కూర్చోబెట్టాం. అదే సమయంలో విక్రం ఆసుపత్రికి అశ్విని ఫోన్‌ చేసి పరిస్థితిని వైద్యులకు వివరించారు’ అని డా.రమణారావు పేర్కొన్నారు. 11.45కు తమ ఆసుపత్రిలో పునీత్‌ను చేర్చారని.. అప్పటికే తీవ్రంగా గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌ను అమర్చామని, కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారని విక్రం ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని