
Pre Wedding Counseling: వధూవరులు కౌన్సెలింగ్కు హాజరైతేనే పెళ్లి!
కేరళ: వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ మహిళా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వివాహబంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రీవెడ్డింగ్ కౌన్సెలింగుకు హాజరుకావాల్సి ఉంటుంది. కౌన్సెలింగుకు హాజరైనట్లు ధ్రువపత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషను చేయాలని కేరళ మహిళా కమిషన్ అక్కడి ప్రభుత్వానికి సూచించింది. కమిషన్ ఛైర్పర్సన్ పి.సతీదేవి ఈ విషయాన్ని వెల్లడించారు. వివాహబంధంలో ఉండే సాధకబాధకాలపై ఈ కౌన్సెలింగులో వధూవరులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ సర్టిఫికెటును వివాహ నమోదు సమయంలో కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.