
Sajjanar: రూ. వంద చెల్లించి రోజంతా ప్రయాణించండి
- ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
ఈనాడు, హైదరాబాద్: పెట్రోలు ధర పెరిగిందని ఆందోళన వద్దని.. రూ.వంద చెల్లించి రోజంతా హైదరాబాద్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీ-24 పేరిట 24 గంటలపాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కండక్టర్ల వద్ద టీ-24 టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ టికెట్‌తో ఆర్డినరీ, సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో 24 గంటల వ్యవధిలో ఎంత దూరమైనా ప్రయాణం చేయవచ్చన్నారు. విధుల్లో ఉండగా డ్రైవర్లు పాన్ మసాలాలు, గుట్కాలు తినకూడదని ఉత్తర్వులు జారీ చేసినట్లు మరో ప్రకటనలో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.