Supreme Court: డిప్యూటీ కలెక్టర్‌ నియామకంపై 37 ఏళ్ల తర్వాత తీర్పు

డిప్యూటీ కలెక్టర్‌ నియామకానికి సంబంధించి 37 ఏళ్లుగా నలుగుతున్న వ్యాజ్యం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది...

Published : 24 Nov 2021 12:54 IST

దిల్లీ: డిప్యూటీ కలెక్టర్‌ నియామకానికి సంబంధించి 37 ఏళ్లుగా నలుగుతున్న వ్యాజ్యం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కేసులో మొదటి ప్రతివాది ఇప్పటికే ఉద్యోగ విరమణ చేశారు. ఉప రవాణా కమిషనర్‌గా ఉన్న చున్నీలాల్‌ అనే వ్యక్తిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించాలంటూ అలహాబాద్‌ హైకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో యూపీ సర్కారు సవాల్‌ చేసింది. చున్నీలాల్‌ 2019లో రిటైరైపోయినందువల్ల హైకోర్టు తీర్పును ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నల ధర్మాసనం పేర్కొంది. ఒకే పోస్టులో ఇద్దరు వ్యక్తుల్ని నియమించాల్సిందిగా ఆదేశించలేమంది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని