
TS News: రోగి, వైద్యుడు.. ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు
కామారెడ్డి : గుండెపోటుకు గురైన ఓ బాధితుడికి చికిత్స చేస్తుండగా వైద్యుడికీ గుండెపోటు వచ్చింది. దీంతో రోగి, వైద్యుడు ఇద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఛాతి నొప్పి వచ్చింది. దీంతో అతడిని వెంటనే గాంధారిలోని ఓ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. బాధితుడికి చికిత్స చేస్తూ వైద్యుడూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. కాసేపటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.