Maharashtra: సంజయ్, సుప్రియాల నృత్యం అదుర్స్‌

మహారాష్ట్రకు చెందిన ఎంపీలు సంజయ్‌ రౌత్, సుప్రియా సూలేలు చేసిన నృత్యం ప్రస్తుతం 

Updated : 30 Nov 2021 12:34 IST

మహారాష్ట్రకు చెందిన ఎంపీలు సంజయ్‌ రౌత్, సుప్రియా సూలేలు చేసిన నృత్యం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. శివసేనకు చెందిన సంజయ్‌ కుమార్తె పూర్వాన్షీ రౌత్‌ వివాహం ఠాణె జిల్లా కలెక్టర్‌ రాజేశ్‌ నర్వేకర్‌ కుమారుడు మల్హార్‌ నర్వేకర్‌తో సోమవారం ముంబయిలోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగింది. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన సంగీత్‌ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ రౌత్‌తో కలిసి ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే కొద్దిసేపు నృత్యం చేసి అలరించారు. దీనిపై భాజపా నాయకుడు రాధాకృష్ణ విఖేపాటిల్‌ విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్రంలో ఎస్టీ కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు, మీరేమో నృత్యాలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు