Diamond: గిరిజన రైతుకూలీ చేతికి రూ.60 లక్షల వజ్రం

ప్రపంచంలోకెల్లా ఆకర్షణీయమైన, నాణ్యమైన వజ్రాలు దొరికే మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పన్నా గనుల్లో గిరిజన రైతుకూలీ ములాయంసింగ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణ కల్యాణ్‌పుర్‌ పట్టి గనిలో కార్మికులు జరుపుతున్న తవ్వకాల్లో రూ.60 లక్షల

Updated : 08 Dec 2021 08:37 IST

ప్రపంచంలోకెల్లా ఆకర్షణీయమైన, నాణ్యమైన వజ్రాలు దొరికే మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పన్నా గనుల్లో గిరిజన రైతుకూలీ ములాయంసింగ్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణ కల్యాణ్‌పుర్‌ పట్టి గనిలో కార్మికులు జరుపుతున్న తవ్వకాల్లో రూ.60 లక్షల విలువ చేసే 13.54 కేరెట్ల వజ్రం ములాయం చేతికి చిక్కింది. దీంతోపాటే మరో ఆరు చిన్న వజ్రాలు ములాయంతోపాటు తవ్వకాలు జరుపుతున్న సహ కార్మికులకు దొరికాయి. ఒకేరోజు దొరికిన ఈ 7 వజ్రాల విలువ దాదాపు రూ.కోటి ఉంటుందని అంచనా. పన్నా గనులకు ఇది ‘డైమండ్‌ డే’ అని అధికారులు తెలిపారు. వేలంలో వీటి అసలు విలువ తెలుస్తుంది. ఈ డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటానని ములాయం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని