
Published : 08 Dec 2021 09:37 IST
TS News: బడి పిల్లలకు సర్కారు కిట్!
ఈనాడు, హైదరాబాద్: సర్కారు పాఠశాలల విద్యార్థులకు ఏటా రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను ఇస్తున్న విద్యాశాఖ వాటిని ఓ స్కూల్ బ్యాగ్‌లో ఉంచి పంపిణీ చేయాలని భావిస్తోంది. దానికో పథకం పేరు పెట్టి ఇవ్వొచ్చా? అందుకు సమగ్ర శిక్షాభియాన్ ద్వారా మరిన్ని నిధులను పొందే అవకాశం ఉందా? అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలకు అయ్యే ఖర్చులో కేంద్రం వాటా 60 శాతం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మందికి స్కూల్ బ్యాగ్‌లు ఇవ్వాలంటే రూ.40 కోట్ల వరకు ఖర్చవుతుంది. జత బూట్లు, రెండు జతల సాక్సులు కూడా ఇస్తే ఎంతవుతుంది? నిధుల సేకరణ ఎలా అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
Tags :