Hyderabad News: 9999.. ఈ నంబర్‌ ఎంత ధర పలికిందంటే?

ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియలో..

Updated : 08 Dec 2021 10:38 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మంగళవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియలో టీఎస్‌09 ఎఫ్‌టీ 9999 నంబరును రూ.20.10లక్షలు చెల్లించి కీస్టోన్‌ ఇన్‌ఫ్రా సంస్థ సొంతం చేసుకుంది. కొత్త సిరీస్‌లో టీఎస్‌09 ఎఫ్‌యూ 0009 నంబరుకు ఎపిటోమ్‌ ప్రాజెక్ట్స్‌ రూ.7.95 లక్షలు చెల్లించగా, 0001 నంబరును రాధికరెడ్డి పెరటి రూ.3.08లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. హైదరాబాద్‌ జిల్లా రవాణా శాఖకు రూ.46,14,824 ఆదాయం చేకూరిందని జేటీసీ పాండురంగ నాయక్‌ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని