
Updated : 11 Dec 2021 12:31 IST
KTR: ఇరవై ఏళ్ల క్రితం ఇలా...లండన్‌లో ఉన్నప్పటి ఫోటో విడుదల చేసిన కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: లండన్‌లో 2001లో తాను లండన్‌లో గడిపిన రోజులను పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తన స్నేహితుడితో ఉన్న ఫొటోలను మధురస్మృతులు పేరిట శుక్రవారం ట్విటర్‌లో జత చేశారు.
నెటిజన్ విజ్ఞప్తికి స్పందన..
నేపాల్‌లో అనారోగ్యంతో మరణించిన తన తల్లి మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు సాయం చేయాలని రాహుల్ అనే నెటిజన్ శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో కోరారు. మంత్రి స్పందించి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు.
Tags :