కిడ్నీ ఇస్తాను.. ఖర్చు భరించరూ: కుమారుడిని కాపాడాలని తల్లి వేడుకోలు

చికిత్స పొందుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు నాయబ్‌ రసూల్‌. ప్రస్తుతం రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతని తల్లి తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కిడ్నీ మార్పిడికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని

Updated : 15 Dec 2021 09:50 IST

చికిత్స పొందుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి పేరు నాయబ్‌ రసూల్‌. ప్రస్తుతం రెండు కిడ్నీలు చెడిపోవడంతో అతని తల్లి తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కిడ్నీ మార్పిడికి దాదాపు రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

నల్గొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన షేక్‌ మస్తాన్‌, మస్తాన్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకైన 14 ఏళ్ల రసూల్‌.. నిడమమనూరు మండలం వేంపాడు స్టేజీ వద్దనున్న మైనార్టీ గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి వచ్చిన పిల్లవాడు అనారోగ్యంతో మంచానపడ్డాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో వైద్యపరీక్షలు చేయించగా.. అతడి రెండు కిడ్నీలు పాడైనట్లు తేలింది. వెంటనే తెలిసిన వారి వద్ద సాయం ఆర్థించి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. అనంతరం వైద్యానికి డబ్బులు లేక నెలక్రితం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యుల సూచన మేరకు వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయిస్తున్నారు. కొడుకు పరిస్థితిని కళ్లారా చూసిన తల్లి.. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడింది. ఇందుకోసం తగిన వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. కిడ్నీ మార్పిడి చేసేందుకు అవకాశం ఉందని, కానీ రూ.10 లక్షల మేర వైద్య ఖర్చులు అవుతాయని చెప్పడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.  సోమవారం బాలుడికి డయాలసిస్‌ చేసే క్రమంలో ఆరోగ్యం పరిస్థితి విషమించిందని, ఎంతో భవిష్యత్తు ఉన్న రసూల్‌ను కాపాడాలని కుటుంబ సభ్యులు, బాలుడి తాత పఠాన్‌ మస్తాన్‌ కన్నీటిపర్యంతంతో అభ్యర్థిస్తున్నారు.

- హాలియా, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని