Hyderabad News: హైదరాబాద్‌ గజగజ.. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సాయంత్రం అయిందంటే గజగజ వణికిస్తోంది.

Updated : 19 Dec 2021 07:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సాయంత్రం అయిందంటే గజగజ వణికిస్తోంది. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి.  ఆదిలాబాద్‌లో కంటే  హైదరాబాద్‌లోనే  రాత్రి ఉష్ణోగ్రతలు  ఒక్కసారిగా పడిపోయాయి. శనివారం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అత్యల్పంగా 8.2 డిగ్రీలు నమోదైంది. రాజేంద్రనగర్‌లో 9.1, బీహెచ్‌ఈఎల్‌లో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఉత్తర, ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న చలి గాలులతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని