AP News: వేషం మార్చి.. ఆరాతీసి: స్వామీజీ వేషంలో కన్నబాబు

నుదుటన విభూది, చలువ కళ్లద్దాలు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాలతో ఓ స్వామీజీ ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరాతీశారు.

Published : 22 Dec 2021 08:57 IST

స్వామీజీ వేషంలో కన్నబాబు

నుదుటన విభూది, చలువ కళ్లద్దాలు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాలతో ఓ స్వామీజీ ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలపై ఆరాతీశారు. అచ్యుతాపురం మండల కేంద్రంతోపాటు ఆవసోమవరం, అప్పన్నపాలెం గ్రామాల్లో పర్యటించి వైకాపా పాలనలోని నవరత్నాలపై ప్రజలు ఏమి అనుకుంటున్నారని ఆరా తీశారు. ఈ స్వామీజీ మరెవరో కాదు.. సాక్షాత్తూ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు (కన్నబాబు). ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా తీరుతెన్నూ మార్చేసి... మారువేషం వేసి మరీ గ్రామాల్లో పర్యటించారు. నిత్యావసర ధరలు, విద్యుత్తు ఛార్జీలు అధికంగా ఉన్నాయని పలువురు చెప్పారు. రోడ్లు బాగోలేవని ప్రస్తావించారు. ప్రభుత్వం 50 శాతం పథకాలు అందిస్తే ధరలు పెరుగుదలతో ఖర్చులు మరింత పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న తర్వాత నేరుగా తహసీల్దార్‌ రాంబాయి, ఎంపీడీఓ కృష్ణల వద్దకు ఇదేవేషంలో వెళ్లిన కన్నబాబు ప్రజలు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారు. ఇన్ని విషయాలు అడుగుతున్నారు... మీరెవరంటూ తహసీల్దార్‌ రాంబాయి ప్రశ్నిస్తే... వేషం తొలగించి ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రభుత్వ పథకాలపై 100 శాతం ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు.

- అచ్యుతాపురం, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని