Map:మేకల వద్దకు దారిచూపే ఓ మ్యాప్‌

మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఎక్కడికైనా వెళ్లి ఆనందంగా

Updated : 28 Dec 2021 15:59 IST

మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఎక్కడికైనా వెళ్లి ఆనందంగా గడపాలని అనిపిస్తుంది. ఉల్లాసంగా గడపడానికి కొందరు దగ్గరలోని పార్కులు, ఆలయాలకు వెళతారు. మరికొందరు పెంపుడు జంతువులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. పెంపుడు జంతువులు లేకపోయినా... కాసేపు మూగజీవాలతో గడపాలనుకునే వారికోసం జర్మనీ రాజధాని బెర్లిన్‌ నగరానికి చెందిన అన్నా బెరెజ్కోవా అనే ఇంజినీర్‌ సరికొత్త మ్యాప్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా మేకల ప్రేమికుల కోసం దీనిని తీర్చిదిద్దారు. మొబైల్‌లో ఈ మ్యాప్‌ చూసుకుంటూ దగ్గర్లోని మేకల షెడ్లకు చేరుకోవచ్చు. అక్కడ వాటితో సరదాగా గడపొచ్చు. ఆహారాన్ని అందిస్తూ ఆనందించొచ్చు. ‘‘ఇంతపెద్ద నగరం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఎక్కడెక్కడ మేకల షెడ్లు ఉన్నాయో తెలుసుకోవడం కష్టం. ఒత్తిడిగా అనిపించినప్పుడు మ్యాప్‌ సహాయంతో అక్కడికి చేరుకుని ఉల్లాసంగా గడపవచ్చు’’ అని మ్యాప్‌ను తయారుచేసిన ఇంజినీర్‌ అన్నా బెరెజ్కోవా చెప్పారు. కృత్రిమ మేధను ఉపయోగించి దీనిని తయారు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉచితంగా వాడుకునేలా తీర్చిదిద్దానన్నారు. మొత్తం 24 మేకల షెడ్లు ఈ మ్యాప్‌లో ఉన్నాయి. గత ఏడాది ఈ మ్యాప్‌ను 11 వేల మంది వీక్షించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని