Old currency: గురువాయూరు ఆలయ హుండీల్లో పాత నోట్లు

భక్తుల కానుకలతో కేరళలోని త్రిశ్శూర్‌ జిల్లా గురువాయూర్‌ ఆలయ హుండీలు కళకళలాడుతున్నాయి.

Published : 05 Jan 2022 11:23 IST

కేరళ: భక్తుల కానుకలతో కేరళలోని త్రిశ్శూర్‌ జిల్లా గురువాయూర్‌ ఆలయ హుండీలు కళకళలాడుతున్నాయి. అయితే ఇదే విషయంపై.. ఆలయ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. హుండీల్లో కానుకలు వేస్తే ఇబ్బందులు ఏం ఉంటాయనేగా మీ సందేహం? ఆ కానుకలు నోట్ల రూపంలో ఉండడం, ఆ నోట్లు రద్దు అయినవి కావడమే అసలు సమస్య! నోట్ల రద్దు తర్వాత.. పాత నోట్లు ఎక్కువగా హుండీల్లో దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లలో ఇలా హుండీల్లో పడిన రద్దైన నోట్ల విలువ.. రూ.1.35 కోట్లుగా ఉంది. ఈ నగదును ఏం చేయాలో నిర్వాహకులకు అర్థం కావడం లేదు. గత శనివారం ఒక్క రోజే.. 36 రూ.1000 నోట్లు, 57 రూ.500 నోట్లు (రద్దైనవి) హుండీలో లభించాయి. వీటికి ఎలాంటి విలువా లేదని తెలిసి నోట్లను భక్తులు హుండీల్లో వేసేస్తున్నారని అధికారులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని