రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో నిరాకరణ.. ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!
రెండో పెళ్లి కోసం సంబంధం చూసేందుకు ఓ మ్యారేజ్ బ్యూరో నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టాడో వృద్ధుడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని...
ఐలాండ్: రెండో పెళ్లి కోసం సంబంధం చూసేందుకు ఓ మ్యారేజ్ బ్యూరో నిరాకరించిందని దారుణానికి ఒడిగట్టాడో వృద్ధుడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. దక్షిణ కొరియాలోని జేజు ఐలాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 16వ తేదీన 64 ఏళ్ల వృద్ధుడు ఓ మ్యారేజ్ బ్యూరోకు వచ్చాడు. విదేశీయులతో పెళ్లి సంబంధాలు కుదిర్చే ఆ సంస్థను తనకు సేవలు అందించాల్సిందిగా కోరాడు. తాను వివాహం చేసుకునేందుకు సత్వరమే ఓ అమ్మాయిని చూసిపెట్టాలని అడిగాడు. కానీ.. ఇక్కడే ఆ వృద్ధుడికి, మ్యారేజ్ బ్యూరో ప్రతినిధికి మధ్య వాగ్వాదం మొదలైంది. కాసేపటి తర్వాత ఆ వృద్ధుడు పట్టరాని కోపంతో ఊగిపోయాడు. తనతో తెచ్చుకున్న సీసా మూత తెరిచి.. అందులోని పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ వృద్ధుడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్