
ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే తీసిన వైద్యులు
తిహాడ్: తిహాడ్ జైలులో ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను మింగేశాడు. జైలు వార్డెన్, ఇతర ఖైదీల కళ్లెదురుగానే ఈ పని చేశాడు. వెంటనే అతడిని జైలులోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌రే సహా ఇతర పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అతడి కడుపులో ఫోన్ ఉందని నిర్ధారించారు. పది రోజులు కష్టపడి ఫోన్‌ను బయటకు తీశారు. కొద్దిరోజుల పాటు ఆ ఖైదీని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తిహాడ్ జైలు డీజీ సందీప్ గోయల్ చెప్పారు. ఆపరేషన్ చేయకుండానే సెల్‌ఫోన్ తీయాలని వైద్యులు భావించినందున.. పది రోజుల సమయం పట్టిందని తెలిపారు. జనవరి 15న అతడి శరీరంలో నుంచి ఫోన్ బయటకు వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో తిరిగి జైలుకు పంపినట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.