Hyderabad News: బంజారాహిల్స్‌లో యూట్యూబర్‌ ‘7 ఆర్ట్స్‌’ సరయూ అరెస్ట్‌

యూట్యూబర్‌ సరయూ, ఆమె అనుచరులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. 

Published : 08 Feb 2022 08:34 IST

జూబ్లీహిల్స్‌: యూట్యూబర్‌ సరయూ, ఆమె అనుచరులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంట్‌ కోసం గతేడాది నిర్వహించిన లఘుచిత్రం.. హిందూ సమాజాన్ని, మహిళలను కించపర్చే విధంగా ఉందంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీహెచ్‌పీ అధ్యక్షుడు చేపూరి అశోక్‌ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసును బంజారాహిల్స్‌ పోలీసులకు బదిలీ చేయగా పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. సోమవారం ఫిలింనగర్‌లోని కార్యాలయంలో ఉన్న సరయూతోపాటు ఆమె బృంద సభ్యులైన దర్శక నిర్మాత, శ్రీకాంత్‌రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్‌ చేశారు. వారిని బంజారాహిల్స్‌ పోలీసు ఠాణాకు తరలించారు. వారికి నోటీసులు జారీ చేశారు. మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని