Telangana News: ప్రేమకథతో యువ ఐఏఎస్‌ పెళ్లి ఆహ్వానం

ప్రేమ కథతో పెళ్లి ఆహ్వానం ఏమిటి అని అనుకుంటున్నారా..? అవును నిజమేనండి.. ఓ యువ ఐఏఎస్‌ అధికారి బంధువులు, మిత్రులు, ప్రముఖులకు తన ప్రేమ కథను వివరిస్తూ రూపొందించిన యానిమేషన్‌ వీడియో పంపుతూ తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం

Updated : 09 Feb 2022 10:18 IST

వీడియోలో గుడిలో ప్రేమను వ్యక్తపరుస్తున్న దృశ్యం

నారాయణపేట పట్టణం, న్యూస్‌టుడే : ప్రేమ కథతో పెళ్లి ఆహ్వానం ఏమిటి అని అనుకుంటున్నారా..? అవును నిజమేనండి.. ఓ యువ ఐఏఎస్‌ అధికారి బంధువులు, మిత్రులు, ప్రముఖులకు తన ప్రేమ కథను వివరిస్తూ రూపొందించిన యానిమేషన్‌ వీడియో పంపుతూ తన పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆ వీడియోలో బస్సులో ప్రారంభమైన తమ ప్రేమను.. ఓ గుడిలో కలుసుకుని ఎలా వ్యక్తపరచుకున్నారు.. పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విధం.. ఈ నెల 10న మూడుముళ్ల బంధంతో ఒక్కటి  కానున్నామని పేర్కొని ‘తమ పెళ్లికి హాజరై.. ఆశీర్వదించాలని..’ వీడియోలో కోరారు. ఇంతకు ఎవరా యువ ఐఏఎస్‌ అనుకుంటున్నారా.. ఆయన ఖమ్మం జిల్లా సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్న పేట జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్‌.  మహబూబ్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయురాలు మనీషాతో తన ప్రేమ కథ..  పెళ్లి వరకు సాగిన ప్రయాణంపై  వీడియో రూపొందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని