Andhra News: కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ కోడ్‌లు

కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ(లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ) కోడ్‌లను కేంద్రం కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌

Updated : 06 Apr 2022 08:03 IST

ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ(లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ) కోడ్‌లను కేంద్రం కేటాయించింది. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌(పీఈఎస్‌)పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు. కేంద్రం, వివిధ రాష్ట్రాలతో పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొత్త జిల్లాలకు కేటాయించిన కోడ్‌ వివరాలు.. పార్వతీపురం మన్యం-743, అనకాపల్లి-744, అల్లూరి సీతారామరాజు-745, కాకినాడ-746, కోనసీమ-747, ఏలూరు-748, ఎన్టీఆర్‌-749, బాపట్ల-750, పల్నాడు-751, తిరుపతి-752, అన్నమయ్య-753, శ్రీసత్యసాయి-754, నంద్యాల-755.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని