Sundar Naidu Uppalapati: సుందరనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఇటీవల కన్నుమూసిన బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడు కుటుంబాన్ని తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.

Updated : 08 May 2022 19:36 IST

చిత్తూరు: ఇటీవల కన్నుమూసిన బాలాజీ హేచరీస్‌ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి శుభస్వీకరణ కార్యక్రమంలో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. చిత్తూరు రెడ్డిగుంటలో సుందరనాయుడు నివాసంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతుల కోసం సుందరనాయుడు ఎంతో శ్రమించారని గుర్తుచేసుకున్నారు. ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. పౌల్ట్రీ రంగంలో సుందరనాయుడు ఒక దారి చూపించారని.. దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పౌల్ట్రీ రైతులకు తెదేపా అండగా ఉంటుందని చెప్పారు.

ఇటీవల సుందరనాయుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో హృద్రోగ సమస్యకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. పశువైద్యుడిగా వృత్తిని ప్రారంభించిన ఆయన... పౌల్ట్రీ పరిశ్రమలో ప్రవేశించి ఆ రంగం అభివృద్ధికి అపార కృషిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఎంతోమంది యువతను పౌల్ట్రీ రంగంవైపు వైపు నడిపించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని