Hyderabad News: బాలకృష్ణ ఇంటి గేటు వైపు దూసుకెళ్లిన కారు

సినీ నటుడు బాలకృష్ణ ఇంటి గేటు వైపు కారు దూసుకెళ్లిన ఘటన ఇది. ఫిలింనగర్‌ వైపు నుంచి టీఎస్‌ 10ఈయూ 3047 నంబరు గల థార్‌ వాహనం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్తుంది. రోడ్‌ నంబరు 45 కూడలి దాటుతుండగా

Published : 18 May 2022 10:11 IST

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: సినీ నటుడు బాలకృష్ణ ఇంటి గేటు వైపు కారు దూసుకెళ్లిన ఘటన ఇది. ఫిలింనగర్‌ వైపు నుంచి టీఎస్‌ 10ఈయూ 3047 నంబరు గల థార్‌ వాహనం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వైపు వెళ్తుంది. రోడ్‌ నంబరు 45 కూడలి దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్‌కు దారిచ్చే క్రమంలో ఒక్కసారిగా కూడలి పక్కనే ఉన్న సినీనటుడు బాలకృష్ణ ఇంటివైపు వాహనం దూసుకెళ్లి పాదచారుల బాటపైకి ఎక్కి పక్కనే ఉన్న ట్రీగార్డును ఢీకొని నిలిచిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనం  నడుపుతున్న యువతికి శ్వాస విశ్లేషణ పరీక్ష చేశారు. మద్యం తాగలేదని గుర్తించారు. వాహనాన్ని అక్కడి నుంచి తొలగించారు.      సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని