TTD: 22న అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల: తితిదే

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల

Published : 19 Aug 2022 01:39 IST

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల ఆన్‌లైన్‌ కోటాను తితిదే ఈనెల 22న విడుదల చేయనుంది. 22వ తేదీ  ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంటాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.  సెప్టెంబరు నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో (27 నుంచి 30 వరకు) అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు.  భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని