Andhra News: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణను కలిసిన సీఎం జగన్‌

సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ విజయవాడ చేరుకున్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాలను

Updated : 20 Aug 2022 13:37 IST

విజయవాడ : సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ విజయవాడ చేరుకున్నారు. విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాలను హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, సీఎం జగన్‌తో కలిసి సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నోవాటెల్‌ హోటల్‌లో సీజేఐను సీఎం జగన్‌ కలిశారు. తెదేపా అధినేత చంద్రబాబు కూడా సీజేఐని మర్యాదపూర్వకంగా కలిశారు.

29 విశాలమైన ఏసీ కోర్టుల హాళ్లు, ఏడు లిఫ్టులు, న్యాయవాదులకు, కక్షిదారులకు వెయిటింగ్‌ హాళ్లు, క్యాంటీన్‌ సహా అన్ని సదుపాయాలతో నూతన కోర్టు భవనాలు అందుబాటులోకి రానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని