Secunderabad Railway Station : ఆహా! సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆకృతులు!

దేశంలో ప్రధానమైన వాటిలో ఒకటైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ని ఆధునిక హంగులతో పునర్నిర్మించనున్నారు.

Published : 30 Oct 2022 08:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో ప్రధానమైన వాటిలో ఒకటైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ని ఆధునిక హంగులతో పునర్నిర్మించనున్నారు. ఇందుకోసం రైల్వేశాఖ ఇటీవల గుత్తేదారునూ ఎంపిక చేసింది. నిర్మాణం పూర్తయ్యాక సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఎలా ఉంటుంది.. అన్న ఆసక్తి నేపథ్యంలో రైల్వేశాఖ స్టేషన్‌ నూతన భవన డిజైన్‌ చిత్రాలు మూడింటిని ట్విటర్‌లో ఉంచింది. సికింద్రాబాద్‌కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ఈ చిత్రాల్ని ట్వీట్‌ చేశారు. వాటిలో సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఆకృతులు విమానాశ్రయ తరహాలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకట్టుకునేలా ఉన్నాయి. భవనాలు ఆధునికంగా, పరిసరాలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని