Indian Racing League : హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో రెండో రోజు ప్రారంభమైన రేసింగ్‌..

ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌(ఐఆర్‌ఎల్‌) హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. అత్యంత వేగంగా దూసుకుపోతున్న కార్లు.. ప్రేక్షకుల కేరింతలతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంది.

Updated : 20 Nov 2022 12:35 IST

హైదరాబాద్‌ : ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌(ఐఆర్‌ఎల్‌) హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. అత్యంత వేగంగా దూసుకుపోతున్న కార్లు.. ప్రేక్షకుల కేరింతలతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంది. రెండో రోజు రేసింగ్‌ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే సందర్శకులను గ్యాలరీల్లోకి అనుమతించారు.

నేటి షెడ్యూల్ ఇదే..

ఉదయం 9 గంటలకు ఫార్ములా-4 క్వాలిఫైయింగ్ రేస్

9.20గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 1

9.40గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్ క్వాలిఫైయింగ్ 2

10.15గంటలకు ఫార్ములా 4లో రేస్ 1 స్టార్ట్ 

11.10 గంటలకు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-1  

మధ్యాహ్నం 12 గంటలకు ఫార్ములా 4లో రేస్ -2

మధ్యాహ్నం 1.35 గంటలకు ఫార్ములా 4లో రేస్ -3 

మ. 2.30 కి ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్ 2

మధ్యాహ్నం 3.50కు ఇండియన్ రేసింగ్ లీగ్‌లో రేస్-3 స్టార్ట్

ఐఆర్‌ఎల్‌ నిన్న అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు, 24 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రహదారి అభివృద్ధి, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ.90 కోట్ల వరకు వెచ్చించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని