Andhra news: ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్‌గా గిరిధర్ అరమణే పేరు తెరపైకి...!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అరమణే పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్ అరమణే పేరు తెరపైకి వచ్చింది. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రక్షణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు గిరిధర్‌ను రిలీవ్ చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో గిరిధర్ అరమణే ఇవాళ భేటీ అయ్యారు. కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ కేడర్ సీనియార్టీ జాబితాలో గిరిధర్ అరమణే రెండో స్థానంలో ఉన్నారు. ఒకవేళ అరమణే సీఎస్‌గా బాధ్యతలు చేపడితే 2023 జూన్ 30 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. కొత్త సీఎస్ నియామకంపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈనెల 30న పదవీవిరమణ చేయనున్నారు. డిసెంబరు 1 నుంచి నూతన ప్రధాన కార్యదర్శి బాధ్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత కొత్త సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నూతన సీఎస్‌గా ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ