Hyderabad: ఫిఫా ప్రపంచకప్‌లో మనోళ్లు
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు లేకపోయినా.. మన దేశం తరఫున ఎంతోమంది భారతీయులు ఖతార్‌లో జరుగుతున్న పోటీల్లో వేర్వేరు రూపాల్లో సేవలందిస్తున్నారు.
వాలంటీర్లుగా పలు స్టేడియాల్లో సేవలు
ఈనాడు, హైదరాబాద్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు లేకపోయినా.. మన దేశం తరఫున ఎంతోమంది భారతీయులు ఖతార్‌లో జరుగుతున్న పోటీల్లో వేర్వేరు రూపాల్లో సేవలందిస్తున్నారు. ఉపాధి కోసం ఎంతోమంది మనదేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు వలస వెళ్లినవారు ఉన్నారు. ఖతార్‌లో తొలిసారి జరుగుతున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌నకు అత్యాధునిక స్టేడియాలను నిర్మించారు. మైదానంలో జరిగేది 90 నిమిషాల ఆటే కానీ.. ఈ పోటీలు సజావుగా సాగాలంటే తెరవెనక ఎంతోమంది శ్రమ దాగి ఉంటుంది.
గతేడాది నుంచే..
ఫిఫా ప్రపంచకప్ పోటీలకు రిహార్సల్స్ గతేడాదే మొదలయ్యాయి. ప్రత్యేకించి మిడిల్ ఈస్ట్‌లో ఇందుకోసం అరబ్‌కప్‌ను నిర్వహించారు. అప్పటి నుంచి వాలంటీర్ల నియామకం మొదలైంది. తొలుత 500 మందిని నియమించుకున్నారు. వీరిలో ఇద్దరు తెలుగువాళ్లు ఏడాదిపాటు వారాంతాల్లోనూ ఇందుకోసం పనిచేశారు. వీరిని పయనీర్స్ అనేవారు. అంకితభావం చూసి ఫిఫా ప్రపంచకప్‌కు కావాల్సిన 15వేల మంది వాలంటీర్స్ ఎంపిక బాధ్యత వీరిలో ఒకరికి అప్పగించారు. వీరిలో 5వేల మంది వేరే దేశాలకు చెందిన వారై ఉండాలి. మిగతా 10వేల మందిని స్థానికుల నుంచి ఎంపిక చేశారు. మొత్తం వాలంటీర్లలో తెలుగువాళ్లు 20 మంది వరకు ఉన్నారు. వీరు వేర్వేరు నగరాల్లో ప్రస్తుతం ఫుట్‌బాల్ పోటీలకు తమ వంతు సేవలందిస్తున్నారు. వాలంటీర్స్ నియామకంలో కీలకంగా వ్యవహరించిన పయనీర్ స్వప్నకుమారి ‘ఈనాడు’తో తమ అనుభవాలను పంచుకున్నారు. ‘‘
విదేశీయులు ఖతార్‌లో అడుగుపెట్టాలంటే మ్యాచ్ టికెట్‌తో పాటు వెల్‌కమ్ కార్డు తప్పనిసరి. టిక్కెట్ కల్గిన ప్రతి ఒక్కరు ముగ్గురికి అతిథ్యం ఇవ్వొచ్చు అని ఖతార్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భారతీయుల్లో చాలామంది టిక్కెట్ కొనుగోలు చేసి వారి కుటుంబసభ్యులను, బంధుమిత్రులను ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. తెలుగువారు కూడా ఇందులో ఉన్నారు’’
అతిపెద్ద స్టేడియం వద్ద విధులు: స్వప్నకుమారి యెజ్జు
మేం అల్వాల్‌లో ఉండేవాళ్లం. 15 ఏళ్ల క్రితం ఖతార్ వెళ్లాం. మా వారు కెమికల్ ఇంజినీర్. నేను ఉపాధ్యాయురాలిని. ఖతార్ మొదటిసారి ఫిఫా ప్రపంచకప్‌కు అతిథ్యం ఇస్తుండటంతో వాలంటీర్లు కావాలనే ప్రకటన ఇచ్చింది. తొలుత అరబ్‌కప్‌కు వాలంటీర్‌గా చేశాను. ఆ తర్వాత ఏడాది పాటు వారాంతాల్లోనూ ప్రపంచప్ కప్ కోసం పనిచేశాం. దీంతో నన్ను పయనీర్‌గా నియమించారు. తెలుగువాళ్లు సైతం ఫిఫా ప్రపంచకప్‌కు వాలంటీర్లుగా సేవలు అందించేందుకు చురుగ్గా ముందుకొచ్చారు. వీరందర్ని కలిపి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశాను. పరస్పరం అనుభవాలను పంచుకుంటున్నాం. ఇందులో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. వాలంటీర్స్ నియామకం పూర్తి కావడంతో ప్రస్తుతం స్పెక్టేటర్ టీమ్ సూపర్‌వైజర్‌గా ఖతార్‌లో అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియం అల్బెట్ వద్ద నేను విధులు నిర్వహిస్తున్నాను.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Team India: అభిమానులూ.. కాస్త ఓపిక పట్టండి.. వారికీ సమయం ఇవ్వండి: అశ్విన్
-
World News
Pakistan: మసీదులో పేలుడు ఘటనలో 44కి చేరిన మృతులు.. ఇది తమ పనేనని ప్రకటించిన టీటీపీ!
-
Politics News
Andhra news: ప్రజల దృష్టిని మరల్చేందుకే నాపై విచారణ : చింతకాయల విజయ్
-
General News
TSPSC: ఉద్యోగ నియామక పరీక్షల తేదీలు వెల్లడించిన టీఎస్పీఎస్సీ
-
Sports News
Pak Cricket: భారత్ మోడల్‌కు తొందరేం లేదు.. ముందు ఆ పని చూడండి.. పాక్‌కు మాజీ ప్లేయర్ సూచన