టీచర్లూ ఇదేం తీరు!
వేళకు బడికి రాని విద్యార్థులను మందలించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే సయమపాలన పాటించక క్రమశిక్షణను కాలరాస్తున్న వైనం శనివారం కరంజి-టిలో వెలుగుచూసింది.
గంట ముందే తిరుగుపయనం
కరంజి-టి బడికి తాళం వేసి ఉన్న చిత్రం
భీంపూర్, న్యూస్‌టుడే : వేళకు బడికి రాని విద్యార్థులను మందలించి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే సయమపాలన పాటించక క్రమశిక్షణను కాలరాస్తున్న వైనం శనివారం కరంజి-టిలో వెలుగుచూసింది. ఆ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులంతా గంట ముందుగానే పాఠశాలకు తాళం వేసి తిరుగుముఖం పట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు పాఠశాల సమయం కాగా.. పదోతరగతి ప్రత్యేక తరగతుల దృష్ట్యా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాఠశాల తెరిచి ఉంచాల్సి ఉంది. ఆదిలాబాద్ పట్టణం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. సాయంత్రం తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు 4 గంటలకు.. ఆ తర్వాత మరొకటి 5.30 గంటలకు అందుబాటులో ఉండగా.. తమకు అనువైన 4 గంటల బస్సుకే ఎక్కి విధులకు ఎగనామం పెట్టిన వైనం చూసి గ్రామస్తులు ఈవిషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పాఠశాల హెచ్ఎం ఎలియాను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. నేను సెలవులో ఉన్నానని, మరొకరికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించానని పేర్కొన్నారు. నాలుగు గంటల బస్సులో ఉపాధ్యాయులు ఎక్కిన విషయమై గ్రామస్థులు తనకూ సమాచారం ఇచ్చారని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kichha Sudeep: కిచ్చా సుదీప్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా?
-
General News
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో రూ.12,800 కోట్లు: అశ్విని వైష్ణవ్
-
General News
Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు
-
India News
RVM: 2024 ఎన్నికల్లో ఆర్వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ
-
Movies News
Thalapathy 67: ఊహించని టైటిల్‌తో వచ్చిన విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబో
-
General News
Viveka murder case: సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ