పులకించె మది.. నృసింహ పరిణయమిది

సాగరసంగమ కెరటాల వేదహోరులో అంతర్వేదిలోని పవిత్ర ధామం దేదీప్యమానంగా శోభిల్లింది. వేదమంత్రోచ్చారణతో జరిగిన మహత్కార్యం అలరించింది.

Updated : 01 Feb 2023 06:17 IST

వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు, రాజోలు: సాగరసంగమ కెరటాల వేదహోరులో అంతర్వేదిలోని పవిత్ర ధామం దేదీప్యమానంగా శోభిల్లింది. వేదమంత్రోచ్చారణతో జరిగిన మహత్కార్యం అలరించింది. అణువణువూ ఆధ్యాత్మిక పరవశంతో వేడుక అంబరాన్ని తాకింది. నింగీ నేలా మురిసే వేళ.. భక్తజనం పారవశ్యంతో నేత్రపర్వంగా చూస్తున్న శుభ సమయాన.. దశమి మంగళవారం రోహిణీ నక్షత్ర యుక్త తులా లగ్నం పుష్కరాంశమున రాత్రి 12.46 గంటలకు స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న శ్రీదేవి, భూదేవితో నారసింహస్వామివారి జగత్కల్యాణం నయనోత్సవంగా సాగింది. నమో నారసింహా స్మరణలు మిన్నంటాయి. సాయంత్రం పంచముఖాంజనేయ, గరుడ వాహన సేవ, ఎదుర్కోలు సన్నాహం జరిగింది. స్వర్ణాభరణాలు అలంకరించిన ఉత్సవమూర్తులను రాత్రి 10.29 గంటలకు ప్రధాన ఆలయం నుంచి తెచ్చి పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. అర్చకుడు శ్రీనివాసకిరణ్‌, వైదిక బృందం పరిణయ ఘట్టాన్ని నిర్వహించారు. స్వామి, ఉభయ దేవేరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మాంగల్యధారణ వైభవంగా జరిగింది. తలంబ్రాల ఘట్టం ఆద్యంతం భక్తులను పులకింపజేసింది.


దివ్య రథోత్సవం నేడు

లక్ష్మీనృసింహుని దివ్య రథోత్సవం బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించేలా సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.


మాంగల్యధారణ అనంతరం దేవేరులతో స్వామివారు

దేదీప్యమానం: వెలుగొందుతున్న అంతర్వేది క్షేత్రం

పట్టువస్త్రాలు తెస్తున్న మంత్రులు, ఎమ్మెల్యే

కలెక్టర్లు హిమాన్షు, కృతికా శుక్లా..

శోభాయమానం: యువత కోలాహలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని