Andhra News: కిరండోల్-విశాఖ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్-విశాఖ మార్గంలోని శివలింగపురం రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
అరకులోయ: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్-విశాఖ మార్గంలోని శివలింగపురం రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు శివలింగపురం ఏడో టన్నెల్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 8 బోగీలు పక్కకు ఒరిగాయి.
బోగీలు పడిపోవడంతో పట్టాల పక్కన ఉన్న కొన్ని విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విశాఖ నుంచి కిరండోల్ వెళ్లే ప్యాసింజర్ రైలును అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ల నగదును తిరిగి చెల్లించారు. రైల్వే డీఆర్‌ఎం సత్పతి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రైల్వే సిబ్బంది ట్రాక్ పనులను పునరుద్ధరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రాక్ పునరుద్ధరణకు 36 గంటలు పట్టే అవకాశముందని రైల్వే సిబ్బంది తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Padma awards: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వీడియో వీక్షించండి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
CM KCR: 23న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
-
Crime News
Teenmar Mallanna: కానిస్టేబుళ్లపై దాడి కేసు.. చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న
-
India News
Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో.. ప్రత్యేక బెంచ్‌కు సుప్రీం ఓకే
-
Movies News
Sreeleela: నేను మొదటి నుంచి బాలకృష్ణకు వీరాభిమానిని: శ్రీలీల