అదిగో చిరుత.. కాదు జంగుపిల్లి

సూర్యలంక అటవీ భూముల్లో చిరుత పులి సంచరిస్తోందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 07 Feb 2023 06:27 IST

అడవిలో తిరిగే జంగుపిల్లి

బాపట్ల, న్యూస్‌టుడే:  సూర్యలంక అటవీ భూముల్లో చిరుత పులి సంచరిస్తోందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆదర్శనగర్‌ సమీపంలో నేచర్‌ క్యాంప్‌ వద్ద, వాయుసేన కేంద్రం లోపల శని, ఆదివారాల్లో రాత్రి సమయంలో చిరుత సంచారాన్ని ప్రత్యక్షంగా చూశామంటూ వాయుసేన కేంద్రం అధికారులు అటవీశాఖ అధికారులకు సోమవారం సమాచారం ఇచ్చారు. కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో సూర్యలంక అటవీ ప్రాంతంలో చిరుత తిరుగుతోందని సమాచారం వచ్చిందని అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. వాయుసేన కేంద్రం లోపల చిరుత కనపడినట్లుగా తనిఖీ సిబ్బందికి ఎలాంటి ఆధారం లేదు. సీసీ కెమేరాల్లోనూ ఎలాంటి జాడ లేదు.
‘సూర్యలంక అటవీ భూముల్లో చిరుత పులుల సంచారానికి అవకాశం లేదు. ఈ ప్రాంతంలోని అడవుల్లో జంగు పిల్లలు ఎక్కువగా సంచరిస్తున్నాయి.’ చేపలు, కుందేళ్లు తింటూ బాగా బలిష్ఠంగా పెరుగుతాయి. ప్రస్తుతానికి చిరుత సంచారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు.’ అని డీఎఫ్‌ఓ భీమయ్య స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని