Telangana News: ప్రీతి ఘటనలో దోషులు ఎంతటి వారైనా చర్యలు తప్పవు: మంత్రి హరీశ్‌రావు

వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనకు కారకులైన దోషులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు  స్పష్టం చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు ఆమె తల్లిదండ్రులకు మంత్రి వివరించారు.

Updated : 23 Feb 2023 22:29 IST

హైదరాబాద్‌: వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపడుతోందని రాష్ట్రఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రీతి ఘటన చాలా బాధాకరమన్న ఆయన ఇందుకు కారకులైన దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేలా నిమ్స్‌ వైద్యులను ఆదేశించినట్టు  తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం నిరంతరం ఆమె ఆరోగ్యంపై పర్యవేక్షణ చేస్తున్నట్టు వివరించారు. ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్న హరీశ్‌రావు.. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో ఎప్పటికప్పుడు స్వయంగా మాట్లాడుతూ..  ఆమె  ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు ఆమె తల్లిదండ్రులకు మంత్రి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని