భద్రాచలంలో ఘనంగా పుష్కర తీర్థయాత్ర

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర తీర్థయాత్ర అట్టహాసంగా సాగింది.

Updated : 20 Mar 2023 08:35 IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఆదివారం పుష్కర తీర్థయాత్ర అట్టహాసంగా సాగింది. వివిధ నదులతో పాటు పుష్కరిణులు, సముద్రాల్లో తీర్థజలాలను వైదిక సిబ్బంది తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు గోదావరి బ్రిడ్జి సెంటర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో తీర్థ జలాల కలశాలను ఉంచగా ఈవో రమాదేవి, ఏఈవోలు శ్రావణ్‌కుమార్‌, భవాని రామకృష్ణ యాత్రను ఆరంభించారు. ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, వైదిక పెద్దలు మంత్రోచ్ఛారణ చేస్తుండగా శేషవాహనంతో పాటు మరో రెండు వాహనాల్లో తీర్థజలాలను ఊరేగించి ఆలయానికి చేర్చారు. 31న ఈ జలాలతో స్వామివారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక క్రతువును నిర్వహించనున్నట్లు వైదిక పెద్దలు తెలిపారు.  

న్యూస్‌టుడే, భద్రాచలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని